మస్జిదులు సామాజిక శిక్షణా కేంద్రాలుగా మారాలి ఖ్వాజీ ఇస్మాయీల్ నిజామీ
మస్జిదులు సామాజిక శిక్షణా కేంద్రాలుగా మారాలి ఖ్వాజీ ఇస్మాయీల్ నిజామీ
సమాజాన్ని రుగ్మతల నుంచి విముక్తి కల్పిస్తే.. భయాలు.. ఆందోళనలు.. లేని సమాజం వృద్ధిలోకి వస్తుంది.. సొసైటీ ఎన్నో జాడ్యాలతో కొట్టుమిట్టాడుతోంది. నేటి ఏఐ యుగంలోనూ మనిషి ఆలోచనలు అనాగరికంగానే ఉంటున్నాయి. అంతరానితనం, కులమత, వర్ణ, వర్గ విభేదాలు మన టెక్ యుగాన్ని వెక్కిరిస్తున్నాయి.
వడ్డీ, జూదం, డ్రగ్స్ మద్యపాన సేననం, హత్యలు, అత్యాచారాలు లాంటి ఎన్నో క్రైమ్స్ సమాజాన్ని నరకకూపంగా మార్చేస్తున్నాయి. కోర్టులు, పోలీసులు, చట్టాలు, సీసీ కెమెరాల వ్యవస్థ ఎన్ని ఉన్నా నేరాలు, జాడ్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. సమాజంలో వ్యక్తుల్లో మార్పు రానంత కాలం చట్టాలు చేసి ప్రయోజనం ఏమాత్రం ఉండదు. ‘పైవాడు చూస్తున్నాడు’ అనే భావన ఎన్నో నేరాలను నియంత్రిస్తుంది. సొసైటీలో చెడులు వ్యాపించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ మంచిని ప్రోత్సహించే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి.
మంచి కోసం ఉద్యమిస్తే చెడును ఓడించడం అసాధ్యమేమీ కాదు. మంచి-చెడుకు మధ్య జరిగే సంఘర్షణలో ఎప్పటికైనా మంచి గెలిచితీరుతుంది. మంచిని గెలిపించే వారు ఇప్పుడు అరుదైపోయారు. సమాజంలోని మేథావులు, ఆధ్యాత్మిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు మంచికోసం పాటుపడాలి. గ్రామ స్థాయి నుంచి ఆ పని జరగాలన్న సంకల్పంతో ఆలూరు గ్రామ మసీదు పెద్దలు ఒక ముందడుగు వేశారు. ప్రతీ శుక్రవారం జుమా సమాజు సందర్భంగా సామాజిక అంశాలపై ఖుర్ఆన్ సందేశాలను తెలుగులో ప్రచారం చేస్తున్నారు.
జమాఅతె ఇస్లామీహింద్ గోదావరి ఖని ఉపాధ్యక్షులు మౌలానా ఇస్మాయీల్ నిజామీ ప్రతీ శుక్రవారం ఏదో ఒక సామాజిక సమస్యపై ఖుర్ఆన్ అందించే పరిష్కారాలను వివరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వడ్డీ చేస్తున్న కీడు, మద్యం, డ్రగ్స్ దుష్పరిణామాలు, తల్లిదండ్రుల నిరాదరణ, మహిళలపై ఫెరుగుతున్న హింస తదితర చెడుగులపై ఆయన ప్రస్తావిస్తారు. అందుకు ఖుర్ఆన్ వాక్యాలను ఉటంకిస్తూ చక్కని పరిష్కారాలను వివరిస్తున్నారు.
కులమతాలకు అతీతంగా ఆగ్రామంలో ఈ ప్రసంగాలకు మంచి ఆదరణ లభిస్తుందని మిల్లీ ఇత్తెహాద్ ఛైర్మన్ -8 ఇంక్లైన్ కాలనీ మసీదు కమిటీ అధ్యక్షులు అయాజుద్దీన్ ,ఇమామ్హఫీజ్ సలీమ్ సాబ్,మౌజాన్ ఇలియాస్ సాబ్, , ఎంతో సంతోషంగా చెబుతున్నారు.
Post a Comment