రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం నియోజకవర్గంలోని నర్సింహసాగర్, రేగళ్లతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్చించారు.
ఈ సందర్బంగా నాగా సీతారాములు కలెక్టర్ తో మాట్లాడుతు కొత్తగూడెం నియోజకవర్గ రైతుల సమస్యలను పరిష్కరించి, బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, ఇప్పటికి కొందరికి పాసు పుస్తకాలు రాక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి వారికి పాసు పుస్తకాలు అందించాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకాలు అందేలా చూడాలని కోరారు. దీనిపై కలెక్టర్ జితీష్ పాటిల్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారం చూపుతానన్నారు.
Post a Comment