క్లినికల్ యాక్ట్ 2010 ప్రకారం అనుమతులు లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు
క్లినికల్ యాక్ట్ 2010 ప్రకారం అనుమతులు లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు
●భద్రాచలంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు మరియు ల్యాబ్ లను తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా ఆసుపత్రులు స్థాపించినా, ల్యాబ్ లను ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పోగ్రాం అధికారి ఎం.హెచ్.ఎన్ డాక్టర్ పి.చైతన్య మరియు డిప్యూటీ డెమో మొహమ్మద్ ఫైజ్ మోహిఉద్దీన్ హెచ్చరించారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోకి పలు ప్రయివేటు ఆసుపత్రులు మరియు రక్త పరీక్ష కేంద్రాలు ,స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ 2010 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని, తనికిలప్పుడు చట్టప్రకారం అనుమతులు లేని యెడల అటువంటి వాటిని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు , ఆయుష్. నేచురోపతి, సిద్ధా,ఫిజియోదేరపి, క్లినికల్ స్థాపన చట్టం కింద నమోదు చేసుకోవాలని సూచించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ తనిఖీని నిర్వహించి, రికార్డులను నిర్వహించాలని మరియు స్కానింగ్ చేయడానికి వెళ్లే ముందు ఫారమ్ ఎఫ్‌ను పూర్తిగా పురించి వైద్య ఆరోగ్య శాఖ అందించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Post a Comment