టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు
టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు
రామవరం టీబీజీకేఎస్ ఆఫీసులో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య గారి ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చీకటి సూర్యుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్మికపక్షపాతి అని, కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యంతో అనేక అగ్రిమెంట్లు చేసుకున్న మిరియాల రాజిరెడ్డి అని అన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ వసికర్ల కిరణ్ కుమార్, కాగితపు విజయ్ కుమార్, సూర్యనారాయణ, ఈ. వెంకటేశ్వర్లు, వెంకటేష్, తిరుపతి, గణేష్, డేవిడ్ రాజు, మీసాల మురళీ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Post a Comment