-->

మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్, ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

 

మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్, ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్, ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ 

ప్రధాన న్యాయమూర్తితో కలిసి మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్* జిల్లా కోర్టు నందు గత రెండు సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తున్న చిన్నారి మూడు విశ్వామిత్ర చౌహన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తో కలిసి శనివారం కోర్టు ప్రాంగణంలో అవకాడ మరియు తైవాన్ మామిడి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..

చిరుప్రాయంలోనే మొక్కలు నాటడం అభినందనీయమని ప్రస్తుత మారుతున్న కాలంలో చెట్లను పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిశ్రమలు బాగా పెరుగుతున్నందున అందులో నుండి వచ్చే పొగ వలన కాలుష్యం జరగకుండా ఓజోన్ పొర దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ చిన్నారి విశ్వామిత్ర చౌహన్ ను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణ మన అందరి రక్షణ అని అన్నారు భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్థి ఆరోగ్యవంతమైన సమాజమని అవి చెట్ల పెంపకం వలనే జరుగుతుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ గొల్లపూడి భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, న్యాయవాదులు అనుబ్రోలు రాంప్రసాదరావు, మెండు రాజమల్లు, కాసాని రమేష్, న్యాయ శాఖ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, దికొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793