కల్లాకపటం ఎరుగని పిల్లలు, ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు (వీడియో)
"నేటి బాలలే రేపటి పౌరులు అని, వారు తమ కలలకు అనుగుణంగా ఎదిగే అవకాశం వాతావరణం కల్పించడం పెద్దల కర్తవ్యం" అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు.
సుభాష్ చంద్రబోస్ నగర్ కొత్తగూడెం 12వ వార్డు మునిసిపాలిటీ లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో చిన్నారులు ఆట పాటలతో అలరించారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బాసిత్ మాట్లాడుతూ కేవలం సంవత్సరానికి ఒకరోజు కాకుండా కనీసం ప్రతి నెలా తల్లి తండ్రులు స్కూల్ నిర్వాహకులు పిల్లల అభిరుచులకు అనుగుణంగా ఆనందం గా గడిపే అవకాశం కల్పించాలని కోరారు. ఈనాడు సెల్ ఫోన్ లలో లీనమై ఆటపాటలు లేకుండా మానసిక ఒత్తిడికి గురికావడం జరుగుతుంది అని అన్నారు
పిల్లల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసి నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, పూలే మదర్ థెరిసా లాంటి మహనీయులను తయారు చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యపకురాలు పర్వీన్ సుల్తాన, టిచర్స్ నీలా, ప్రసన్న, నుసరత్, శిరీషా, సరస్వతి, సల్మా, లతీఫా, అనిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment