వసతిగృహాలు, కాలేజీలను ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి భానుమతి
అన్నపురెడ్డిపల్లి మండలంలోని వసతి గృహాలను కాలేజీలను ఆకస్మికతనికి నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భానుమతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి గురువారం అన్నపురెడ్డిపల్లి మండలం లోని ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడడ్ జూనియర్ కాలేజీ బాలికలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల జూనియర్ కళాశాల బాలురు, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల డిగ్రీ కళాశాల బాలురు, మరియు కస్తూరిబా బాలికల విద్యాలయం వసతి గృహాలను బాలురు మరియు బాలికల వసతి గృహాలను అక స్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు మరియు ఆహారము పారిశుద్ధ్యం స్టోర్ రూమ్లు కిచెన్ రూమ్లను పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు
వసతి గృహాల సౌకర్యాల గురించి విద్యార్థులను ఆరా తీశారు. వసతి గృహాలు సరిగ్గా లేని వాటికి మెరుగుపరుచుకోవాలని హాస్టల్ వార్డెన్ లను మరియు ప్రిన్సిపల్ లను ఆదేశించారు. తక్షణమే మెరుగుపరుచుకోవాలని ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి తీసుకురావడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని న్యాయమూర్తి తెలిపారు..
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ పట్టుపల్లి నిరంజన్ రావు, అన్నపురెడ్డిపల్లి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ప్రిన్సిపల్ సిహెచ్ రాధాకృష్ణ,ప్రిన్సిపాల్ ఎన్ చైతన్య, ఇన్చార్జి ప్రిన్సిపల్ వి విజయలక్ష్మి,, ఎస్ కే బురాన్, వార్డెన్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment