భద్రాచలం RTO చెక్ పోస్ట్ వద్ద 53 లక్షల గంజాయి పట్టివేత
ఏపీ నుంచి పూణేకు తరలి వెళ్తున్న గంజాయి
ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి మహారాష్ట్రలోని పూణేకు 210 గంజాయిని కారులో తరలిస్తూ ఉండగా భద్రాచలం RTO చెక్ పోస్ట్
వద్ద భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీం ఉన్నిసా బేగం సిబ్బంది కలిసి గురువారం పట్టుకున్నారు. పట్టుకున్న 210 కేజీల గంజాయి విలువ రూ 53 లక్షలు ఉంటుంది. గంజాయితోపాటు ఐదు లక్షల విలువ చేసే కారు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని పట్టుకున్న భద్రాచలం ఎక్సైజ్ పోలీసులను సీఐ రహీం ఉన్నిసా బేగం, ఎస్సై అల్లూరి సీతారామరాజు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్ అభినందించారు.

Post a Comment