కంపెనీ లెవెల్ కల్చరల్ మీట్ ను ప్రారంభించిన జీఎం షాలేం రాజు
కంపెనీ లెవెల్ కల్చరల్ మీట్ ను ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు
కొత్తగూడెం ఏరియాలో 2024-25 సంవత్సరంనకు WPS & GA స్పోర్ట్స్ లో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని ఆర్.సి.ఓ.ఏ క్లబ్, రుద్రంపూర్ నందు సింగరేణి కంపెనీ లెవెల్ కల్చరల్ మీట్ తేదీ. 14.11.2024 మరియు 15.11.2024 న నిర్వహించడంలో భాగంగా ఈరోజు కంపెనీ లెవెల్ కల్చరల్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా జిఎం పాల్గొని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు యూనియన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, స్పోర్ట్స్ సూపర్వైజర్, ఆర్గనైజర్స్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసినారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంలో దోహదం చేస్తాయని తెలియజేశారు. క్రీడలో పాల్గొనేవారు స్నేహపూర్వక పాల్గొని క్రీడలను ఆడాలని ఆటను ఆస్వాదించవలసిందిగా తెలియజేశారు. అలాగే క్రీడలలో ఎంతోమంది పాల్గొంటారు కానీ కళలను ప్రదర్శించేవారు చాలా తక్కువ మంది ఉంటారని కళలతో (కల్చరల్) ఎంతోమందికి మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటుగా చైతన్యపరచవచ్చని స్వాతంత్రం రావడం కొరకు మన పూర్వీకులు ఎంతోమంది జానపదాలు మరియు సంస్కృతిక కార్యక్రమాలచే ఎంతోమందిని ఉత్తేజపరిచి చైతన్యవంతులుగా తీర్చి స్వాతంత్రం సాధించడంలో పాలు భాగస్తులు చేశారని తెలియజేశారు.
కంపెనీ మనకు ఇచ్చిన ఈ అవకాశాలను సద్వినియోగపరుచు కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం గారితో పాటు ఎస్ఓటు జి ఎం జి.వి.కోటిరెడ్డి, డీజీఎం (పర్సనల్) బి.శివ కేశవరావు, కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జై గట్టయ్య, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, సీఎంఓఏఐ జనరల్ సెక్రెటరీ ఎ. ఉపేంద్ర బాబు, హానర్బుల్ సెక్రెటరీ ఎం.శ్రావణ్ కుమార్, స్పోర్ట్స్ మేనేజర్ టి శ్రీనివాస్, జడ్జెస్ ఎన్.సి.హెచ్ ఆచార్య, ఉషా మాధవి, శాంతి శ్రీ, కొత్తగూడెం ఏరియా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ జే.రాంబాబు, స్పోర్ట్స్ సూపర్వైజర్ పాస్ నైట్, జనరల్ కెప్టెన్ కె.నాగమోహన్, స్పోర్ట్స్ మెంబర్ సిహెచ్ సాగర్, అలాగే ఇతర ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్స్, ఇతర కళాకారులు పాల్గొన్నారు.

Post a Comment