మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) మృతి చెందారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన.. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఊకే అబ్బయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ నుంచి రెండు సార్లు, టీడీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1983లో బూర్గంపాడు నుంచి, 1994, 2009 లో ఇల్లందు నుంచి ప్రాతినిథ్యం వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక బీఆర్ఎస్ పార్టీలో చేరి, ఇల్లందు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఇల్లందు నుంచి టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఊకే అబ్బయ్య మృతితో ఇల్లందు నియోజకవర్గంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Post a Comment