KPSG, 1&2 సోషల్ మీడియా గ్రూప్ సభ్యులు చదువుల తల్లి గౌతమీకి చెక్ అందజేత
KPSG,1&2 సోషల్ మీడియా గ్రూప్ సభ్యులకు ధన్యవాదములు
ఎంబీబీఎస్ సీటు సాయం కోసం ఎదురుచూస్తున్న చదువుల తల్లి" తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ముందుగా KPSG సోషల్ మీడియా స్పందించి చదువుల తల్లి గౌతమీ కు తమ వంతుగా కనీసం ఒక ఏడాది కు అయ్యే ఖర్చుల కోసం అయినా సహాయం చేయాలి అనే దృఢ సంకల్పంతో ముందడుగేసి సభ్యుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.
KPSG సోషల్ మీడియా విజ్ఞప్తి ను మన్నించి సహృదయం, పెద్ద మనస్సుతో కుల, మత, రాజకీయ, భేదం లేకుండా గౌతమి కు తమ వంతు విరాళాలు అందించిన KPSG గ్రూప్ లోని రాజకీయ నాయకులకు, మేధావులకు, విద్యావంతులకు, డాక్టర్లకు, న్యాయవాదులకు, జర్నలిస్టులకు, వ్యాపార వేత్తలకు, ప్రవాస భారతీయు (NRI )లకు, ప్రభుత్వ & ప్రైవేటు ఉద్యోగులకు,విద్యార్థులకు, యువత కు, సామాజిక కార్యకర్తల కు,గ్రూప్ లేక పోయినా KPSG అప్పీల్ ను తమ స్నేహితుల ఫోన్లలో చూసి స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా శిరస్సు వహించి నమస్కరిస్తూ ధన్యవాదములు తెలుపుతున్నాం.
*KPSG అప్పీల్ ను వారి తండ్రి గారైన భూక్యా నాయక్ ఫోన్లో చూసి తమ కిడ్డీ బ్యాంక్ నుండి 2500 విరాళంగా ఇచ్చిన చిన్నారులు దీక్షిత & యశ్వంత్ నాయక్ లకు మా ప్రత్యేక ధన్యవాదములు*
*ఈ కార్యక్రమానికి కోశాధికారులు గా వ్యవహరించిన రెండు గ్రూప్ ల నుండి అప్పారీ లక్ష్మణ్ కి & మొహమ్మద్ ముజీబ్ కి మా ప్రత్యేక ధన్యవాదములు.
*KPSG సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సహకరించిన సయ్యద్ ఉమర్ కి & సురేష్ నాయక్ కు మా ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు.

Post a Comment