దైవదర్శనానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
నిర్మల్ జిల్లా: కోతులను తప్పించబోయే ప్రయత్నంలో కారు ప్రమాదానికి గురై భార్యాభర్తలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన శనివారం రాత్రి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం:
మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలం దర్శనానికి వస్తున్న కారు రోడ్డుపై అడ్డుగా వచ్చిన కోతిని తప్పించేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుల వివరాలు:
మృతులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌కు చెందినవారుగా గుర్తించారు. వారు కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి ప్రయాణిస్తుండగా ఈ విషాదం జరిగింది.

Post a Comment