13న భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా సీనియర్ మెన్ హాకీ ఎంపికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ మెన్ హాకీ జట్టు ఎంపికలు ఈ నెల 13న (గురువారం) నిర్వహించనున్నారు. ఈ ఎంపికలు కొత్తగూడెం పట్టణంలోని రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బట్టు ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎంపికల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హాకీ పోటీలు ఈ నెల 16 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించనున్నారు. అక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈమంది ఉదయ్ కుమార్ తెలిపారు.
ఎంపికలలో పాల్గొననున్న క్రీడాకారులు తమ వెంట హాకీ ఇండియా గుర్తింపు కార్డు మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. జిల్లా హాకీ అభిమానులు, క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని హాకీ అసోసియేషన్ సూచించింది.

Post a Comment