సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం: ఏప్రిల్ 23 నుంచి సెలవులు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ టైమింగ్స్ కూడా ఖరారు చేసింది.
- సాధారణ పాఠశాలలు: ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే.
- టెన్త్ పరీక్షలు కొనసాగుతున్న స్కూల్స్: మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు క్లాసులు.
ఏప్రిల్ 23తో సమ్మర్ హాలిడేస్ ప్రారంభం
తెలంగాణ విద్యాశాఖ ప్రకారం, మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. ఆ తరువాత సమ్మర్ సెలవులు మొదలవుతాయి.
ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి మధ్య నాటికి ఎండలు మరింత పెరుగుతాయని అంచనా వేయడం వల్లే ప్రభుత్వం ముందస్తుగా హాఫ్ డే స్కూల్స్ ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

Post a Comment