ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ (A2)కు ఉరిశిక్ష
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ (A2)కు ఉరిశిక్షను విధించింది. అదేవిధంగా, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.
2018 సెప్టెంబర్ 14న, ప్రణయ్ తన గర్భవతిగా ఉన్న భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళుతూ, తిరిగి వస్తున్న సమయంలో దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ హత్యకు కారణం అమృత తండ్రి మారుతీరావు (A1) కులాంతర వివాహాన్ని అంగీకరించకపోవడం. మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.
కేసు విచారణలో, నిందితులు సుభాష్ శర్మ (A2), అస్గర్ అలీ (A3) విచారణ ఖైదీలుగా ఉన్నారు, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు (A1) 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
కోర్టు తీర్పు తర్వాత, నిందితులు శిక్ష తగ్గించాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నారు, తమ ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులను ప్రస్తావించారు. అయితే, న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిగణించి తగిన శిక్షలను విధించింది.
ఈ తీర్పు ప్రణయ్ కుటుంబానికి న్యాయం చేయడంలో కీలకమైనది. కులాంతర వివాహాలను అంగీకరించకపోవడం వల్ల జరిగే పరువు హత్యలకు ఇది గుణపాఠం కావాలి.

Post a Comment