-->

రేపటి నుంచి ఒంటిపూట బడులు..!!

రేపటి నుంచి ఒంటిపూట బడులు..!!

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు

హైదరాబాద్‌, ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా బడులను ఒంటిపూట నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ మేరకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (మిడ్‌డే మీల్) 12:30 గంటల సమయంలో అందజేయనున్నారు.

అయితే, ఎస్సెస్సీ (10వ తరగతి) పరీక్షా కేంద్రాలుగా ఉపయోగిస్తున్న పాఠశాలలు మాత్రమే మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక, ఆయా పాఠశాలలు మళ్లీ ఉదయం షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయి. అలాగే, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి.

ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఎండ ప్రభావం లేకుండా సురక్షితంగా విద్యను కొనసాగించగలరని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793