-->

నటుడు మోహన్ బాబుపై ప్రాణహాని ఆరోపణ

 

నటుడు మోహన్ బాబుపై ప్రాణహాని ఆరోపణ

ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురుగట్ల చిట్టిబాబు అనే వ్యక్తి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉందని, అలాగే గతంలో నటీమణి సౌందర్య మరణానికి కూడా మోహన్ బాబే కారణమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిట్టిబాబు తన ఫిర్యాదులో, మోహన్ బాబు ప్రస్తుతం జల్పల్లిలో నివసిస్తున్న టౌన్షిప్ అసలు సౌందర్యదేనని పేర్కొన్నారు. ఈ కారణంగా, మోహన్ బాబును ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మోహన్ బాబుపై వచ్చిన ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశముంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793