ప్రభుత్వ ఐటిఐలో పీఎం నేషనల్ అప్రెంటిస్షిప్ మేళకు విశేష స్పందన
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) లో జరిగిన పీఎం నేషనల్ అప్రెంటిస్షిప్ మేళకు విశేష స్పందన లభించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ జి. రమేష్ వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. టాటా ఏరోస్పేస్ లిమిటెడ్ నుండి రాజు, మేధ సర్వో డ్రైవ్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి జనరల్ మేనేజర్ రంగారావు, ఎల్ అండ్ టి చెన్నై నుండి యశ్వంత్, టీ-హబ్ హైదరాబాద్ నుండి బాలాజీ మేళాలో పాల్గొని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను పరిచయం చేశారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనగా, అందులో 136 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని ప్రిన్సిపాల్ జి. రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు అప్రెంటిస్షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తగిన విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామ్మోహన్రావు, ప్రభుత్వ ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్లు కే. శోభన్ బాబు, కే. రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ మేళా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకే కాదు, భవిష్యత్తులో మెరుగైన పరిశ్రమ అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Post a Comment