టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు
కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
కొత్తగూడెం: టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక జ్యోతి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాన వీరభద్రం, కొత్తగూడెం మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ, కల్వకుంట్ల కవిత సహకారంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో, సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించగలిగామని గుర్తు చేశారు. ముఖ్యంగా,
- 2014 ముందు 3200 మంది పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగులు కొరకు పోరాడగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఒకే ఏడాదిలో వారికి ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.
- కారుణ్య నియామకం ద్వారా 15,000 పైచిలుకు ఉద్యోగాలు, ఎక్స్‌టర్నల్ నియామకం ద్వారా 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.
- కార్మికుల ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షల రుణంపై వడ్డీ రాయితీ, వారి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందించడంలో టీబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందని వివరించారు.
కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ, మహిళలకు 33% రిజర్వేషన్ కోసం కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం, బీసీల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం 46% రిజర్వేషన్ కోరుతూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మూడు బిల్లుల సాధన కోసం ఆమె కృషి చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అశోక్, తిరుపతి, శివకుమార్, ఫిట్ సెక్రటరీ సూర్యనారాయణ, కరాటే శ్రీనివాస్, బాబ్ జానీ, శ్రీకాంత్, పూర్ణ, అశోక్ వేణుగోపాల్, రుక్మంగాధర్ రావు, సుందర్, అరుణ్, జెన్నీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment