ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి
ఈరోజు మండల ప్రత్యేక అధికారి ఎం. శ్రీనివాస్ బీబీపేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
బీబీపేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించిన ఆయన, ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్మాణ పనులను దగ్గరగా పరిశీలించారు. అనంతరం శివరాం రెడ్డి పల్లి గ్రామపంచాయతీ లోని ఇందిరమ్మ ఇళ్ల ప్రాంగణంలో ముగ్గు వేయడం జరిగింది.
దీంతో పాటు యాడారం గ్రామం లో నర్సరీ అభివృద్ధి, త్రాగునీరు, శానిటేషన్ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మల్కాపూర్ గ్రామపంచాయతీ లో సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
తదనంతరం బీబీపేట్ గ్రామపంచాయతీలో ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్) పథకం కింద పేమెంట్ చేపించబడింది.
ఈ పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొని వివిధ అభివృద్ధి పనులపై అధికారికి వివరాలను అందజేశారు.

Post a Comment