-->

కార్పొరేట్లను CSR నిధులు వెచ్చించమని కోరిన కమిషనర్

 

కార్పొరేట్లను CSR నిధులు వెచ్చించమని కోరిన కమిషనర్

చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లను CSR నిధులు వెచ్చించమని కోరిన కమిషనర్

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువుల అభివృద్ధికి ఉన్న అన్ని ఆటంకాలను తొలగిస్తామని, ఇందుకోసం కార్పొరేట్ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు తమ సామాజిక బాధ్యత నిధులు (CSR ఫండ్స్) వినియోగించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పిలుపునిచ్చారు.

బుధవారం జరిగిన సమావేశంలో, చెరువుల అభివృద్ధికి ముందుకు రావాలని కోరుతూ, ఇప్పటికే CSR నిధులను వెచ్చిస్తున్న 72 సంస్థల ప్రతినిధులతో కమిషనర్ చర్చించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ (GHMC) లేక్స్ విభాగం అదనపు కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ CSR వింగ్ డైరెక్టర్ అర్చనా సురేష్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.

కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, చెరువుల అభివృద్ధి అంటే కేవలం సుందరీకరణకు పరిమితం కాకుండా, వాటిని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ క్రమంలో, మాధాపూర్‌లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్‌లోని నల్ల చెరువు, అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్నుద్దీన్ దౌలా చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువుల పరిస్థితి

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1,025 చెరువులు ఉన్నప్పటికీ, వాటిలో 61% జాడ లేకుండా పోయాయని, మిగిలిన 39% చెరువులను పరిరక్షించడం అత్యవసరమని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువుల సంరక్షణ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, స్థానికులు అందరూ కలిసి చేయాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, CSR నిధులతో మరిన్ని చెరువులను అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని, చెరువులను పునరుద్ధరించడం ద్వారా నగర నీటి భద్రతకు తోడ్పడాలని హైడ్రా కమిషనర్ పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793