139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం HMS నేత ఖాజీ ఇస్మాయిల్ నిజామీ శుభాకాంక్షలు
హక్కుల గొంతుకగా మేడే – శ్రమికుల అస్థిత్వం ప్రతిధ్వనిగా మారిందని హింద్ మజ్దూర్ సభ జాతీయ నేత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పేర్కొన్నారు.
మహానగరాలు నిర్మించడానికి కార్మికుల మట్టి కలిపిన చేతులే కారణమని, ప్రతి తినే అన్నం వెనుక కార్మికుల శ్రమనీతి, వారి చెమట బిందువులని గుర్తు చేస్తూ ఆయన హృదయ స్పర్శించే సందేశం విడుదల చేశారు. "వేతనమే శ్వాసగా మారిన జీవితం ఏ పండగకూ చోటివ్వలేదు, కానీ మేడే మాత్రం ప్రతి కార్మికుడి గుండె ధ్వని," అంటూ ఆయన చెప్పారు.
ఆర్ధిక లాభాలు కొందరి జేబుల్లో వెలిగినప్పటికీ, కార్మికుల జీవితాలు చీకట్లలో మగ్గిపోతున్నాయని ఆయన అన్నారు. అయినప్పటికీ శ్రమికులు వారి దారిని తప్పకుండా ముందుకు నడిపించారని, ఈ నేలపై వారి అడుగులు మార్గాలను చెక్కాయని స్పష్టం చేశారు.
"మేము కేవలం కార్మికులం కాదు, పచ్చని పంటల బడులు, సమాజ సమతుల నిర్మాణానికి మేం కీలకంగా ఉన్నాం," అని ఆయన పేర్కొన్నారు. మేడేను ఒక జ్ఞాపికగా కాకుండా ఒక శక్తివంతమైన స్ఫూర్తిగా చూడాలని, ప్రతి శ్రమికుడు తన అస్తిత్వం విలువను ప్రశ్నించే సమయం ఇది అని ఆయన అభిప్రాయపడ్డారు.
మేడే సందేశాన్ని కార్మికుల సంక్షేమం, సమానత్వం, మరియు హక్కుల కోసం సమాజం అంతటా వినిపించే పిలుపుగా ఆయన వినిపించారు.
Post a Comment