-->

రామవరం‌లో 139వ మే డే సందర్భంగా అల్లనేరేడు మొక్క నాటే కార్యక్రమం

రామవరం‌లో 139వ మే డే సందర్భంగా అల్లనేరేడు మొక్క నాటే కార్యక్రమం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం సీఆర్పీ క్యాంపులో 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం బ్రాంచ్ కార్యదర్శి పెయ్యాల రంగారావు జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఆర్పీ క్యాంప్ సీపీఐ శాఖ కార్యదర్శి మరియు సీనియర్ నాయకుడు మర్రి కృష్ణ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ప్రకృతి పరిరక్షణకు గుర్తుగా మే డే శుభాకాంక్షలతో అల్లనేరేడు మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో "ప్రకృతి హరిత దీక్ష" అధ్యక్షుడు, 'మన కీ బాత్' మొక్కల రాజశేఖర్, ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఐ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్ కుమార్, సీపీఐ సీనియర్ నాయకుడు మర్రి గోపికృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని మరింత సార్థకంగా మార్చేందుకు మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములవ్వాలి” అని అన్నారు. చెట్లు నాటటం, వాటిని పెంచుకోవటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సంఘటిత మరియు అసంఘటిత రంగాల కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ, ఎఐటీయూసీ నాయకులు దాసరి అశోక్, కోర్లపాటి కుమార్, దిలీప్ గుప్తా, గుత్తుల శ్రీనివాస్, తోట మల్ల నాగేశ్వరరావు, రాజేందర్ రామ్, రక్తదాత కన్నా, విద్యార్థిని పారుల్, వెంకటేశ్వర్లు, కాంపల్లి రాజయ్య, మాజీ కౌన్సిలర్ సుధాకర్, హైదర్ ఆలీ, నయీమ్, యూత్ కార్యకర్తలు ఏసు, చింటూ, లిఖిత్, నితిన్, చిన్న, సతీష్, దేవయ్య, నాగయ్య, స్వామి, నాగరాజు, బాల లింగమా తదితరులు పాల్గొన్నారు. వారు వివిధ రకాల మొక్కలను నాటి మే డే శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.