కొత్తగూడెం మేజిస్ట్రేట్ బాధ్యతలు స్వీకరించిన రవికుమార్
కొత్తగూడెం, లీగల్: కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా నూతనంగా నియమితులైన బి. రవికుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి తమ గౌరవాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజిస్ట్రేట్ రవికుమార్‌కు అభినందనలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు రవికుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మేజిస్ట్రేట్ రవికుమార్ న్యాయవ్యవస్థలో అనుభవాన్ని కలిగి ఉండటంతో, ఆయన స్ధానానికి న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానికంగా న్యాయసేవల మరింత సజావుగా సాగేందుకు ఆయన నేతృత్వం తోడ్పడుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక శుభ ప్రారంభం అని, న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తానని మేజిస్ట్రేట్ రవికుమార్ తెలిపారు.
Post a Comment