సీనియర్ న్యాయవాది ఆళ్ల గురు ప్రసాద్ రావు మృతి – ఫుల్ కోర్ట్ రిఫరెన్స్
విశాఖపట్నంలో శనివారం ఉదయం సీనియర్ న్యాయవాది, కమ్యూనిస్టు భావజాలానికి అంకితుడైన ఆళ్ల గురు ప్రసాద్ రావు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం తీవ్ర శోకాన్ని వ్యక్తం చేసింది. ఆయనకు నివాళులర్పించేందుకు జిల్లా కోర్టు హాల్‌లో ప్రత్యేకంగా ఫుల్ కోర్ట్ రిఫరెన్స్‌ను నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి పి. వసంత్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి. వసంత్ మాట్లాడుతూ, “ గురు ప్రసాద్ రావు అనేకమందికి ఉచిత న్యాయసహాయం అందించిన, న్యాయవాద వృత్తిలో అపారమైన సేవలందించిన మహానుభావులు. వారి మృతి న్యాయవ్యవస్థకు తీరనిలోటు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్. సరిత, కె. కిరణ్ కుమార్, సుచరిత, కె. సాయి శ్రీ, బి. రవికుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లులు పాల్గొన్నారు. వారు గురు ప్రసాద్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణతో పాటు సీనియర్ న్యాయవాదులు పలివెల గణేష్ బాబు, వై. ఉదయ భాస్కర్ రావు, వై. బాబురావు, కె. పుల్లయ్య, పోసాని రాధాకృష్ణమూర్తి, రమేష్ కుమార్ మక్కాడ్, జె. శివరాం ప్రసాద్, చండ్ర నరేంద్ర తదితరులు గురు ప్రసాద్ రావు సేవలను స్మరించుకున్నారు. ఆయనతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన న్యాయసేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జే. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి బి. మాధవరావు, మహిళా ప్రతినిధి అడపాల పార్వతి, క్రీడల కార్యదర్శి ఉప్పు అరుణ్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా రెండు నిమిషాల మౌనం పాటించి, గురు ప్రసాద్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ ఫుల్ కోర్ట్ రిఫరెన్స్‌లో సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు మరియు లా ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment