సంగారెడ్డి జిల్లా రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సీఎం రేవంత్ తీవ్ర విచారం వ్యక్తం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గురైన వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
అలాగే గాయపడిన కార్మికులకు అత్యవసర వైద్య సాయాన్ని అందించేందుకు సమీపంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని, ఏ ఒక్కరికి వైద్యం కొరత లేకుండా చూడాలని సూచించారు. సహాయక బృందాలు, ఫైర్ సిబ్బంది సమర్థవంతంగా స్పందించి మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం బాధితుల పక్షాన పూర్తిగా నిలుస్తుందని, అవసరమైన పరమార్త సాయం అందిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఘటనపై మరింత సమాచారం కోసం ఉన్నతస్థాయి సమీక్ష జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Post a Comment