-->

రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పట్టణ కన్వీనర్ మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు హాజరై ప్రసంగించారు.

అయన మాట్లాడుతూ – "రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నిరంతరం పోరాడుతున్న నాయకుడు. దేశంలో ఐక్యత, సామాజిక న్యాయం, యువత భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమైనది. భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పునర్వైభవం సాధించి దేశానికి గౌరవం తీసుకొస్తుంది" అని అన్నారు. ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 రాహుల్ గాంధీ దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగ సీతారాములు, అల్లాడి నరసింహారావు, గడ్డం రాజశేఖర్, షేక్ నయీన్, ఎం.ఎ. రజాక్, కాసుల వెంకట్, మద శ్రీ రాములు, షేక్ అబ్దల్ సలాం, షేక్ నీసర్, తంగేళ్ళ లష్మణ్, పల్లపు లష్మణ్, Ex  mpte భద్రం, దావుద్, ఉస్మన్, బాధవత్ కోటేష్, సంగు యాదాద్రి, తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793