స్వేచ్ఛ మృతి కేసులో కీలక మలుపు: పూర్ణ చందర్ రిమాండ్, సంచలన విషయాల వెల్లడి
హైదరాబాద్: స్వేచ్ఛ మృతి కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన పూర్ణ చందర్‌ను పోలీసులు నేడు జడ్జి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించగా, అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా పూర్ణ చందర్ ఇచ్చిన కన్ఫషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, జోగినిపల్లి సంతోష్ రావు పేరు కూడా అతని వాంగ్మూలంలో ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. “నా సంబంధంలో ఉన్న అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసు” అని పూర్ణ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లిన స్వేచ్ఛ, మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు తిరిగివచ్చినట్టు సమాచారం. తిరిగివచ్చిన అనంతరం పూర్ణ చందర్ తో మళ్లీ పెళ్లి అంశంపై గొడవ చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలోనే పూర్ణ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పినట్లు, తాను సామాన్యుడిని కాదని, తనను ఏమీ చేయలేరని బెదిరించినట్టు సమాచారం.
ఇటీవల కాలంలో స్వేచ్ఛతో పూర్ణచందర్ maintained చేసిన సంబంధం విషయమై సంతోష్ రావుకూ సమాచారం ఉందని పూర్ణ పేర్కొన్నట్టు విచారణాధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో రాజకీయ కబంధాలు, సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Post a Comment