బిబిపేట మార్కెట్‌కు వర్షాకాలంలో నరకయాతన.. పక్కా వసతులు కల్పించాలని రైతుల ఆవేదన
బిబిపేట మండలానికి చెందిన 9 గ్రామాల నుండి రైతులు, వ్యాపారస్తులు ఈ మార్కెట్‌కి వస్తూ తమ పంటలు, కూరగాయలు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు. అయితే వర్షాకాలంలో మట్టి రోడ్డులు నీటితో మునిగి పోవడం, ఎండాకాలంలో దుమ్ము రేగిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా రైతులు తమ వస్తువులను భూమిపై పెట్టలేక, ప్రజలు సరుకులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ కొరివి నరసింహులు మాట్లాడుతూ:
“ఈ మార్కెట్‌కు రోజూ వేలాది మంది రైతులు వస్తున్నారు. కనీసం షెడ్‌లు, నీటి సదుపాయం, శుచిత్వం లాంటి అవసరాలే లేకపోతే ఎలా? సెటైలర్ వేసి, మట్టి రోడ్లకు బదులుగా కాంక్రీట్ రోడ్లు వేయాలి. కనీసం వర్షం నుండి రక్షణ కలిగేలా షేడ్లు ఏర్పాటు చేయాలి. అలాగే 24 గంటల కరెంట్ సదుపాయం ఉండాలి.”
బిబిపేట మండలం చివరిలో ఉన్నందున, ఇది సమీప మండలాలైన దుబ్బాక (10 కి.మీ.), సిద్ధిపేట (35 కి.మీ.), కామారెడ్డి (30 కి.మీ.) నుండి కూడా వ్యాపారులు వస్తున్నారు. బట్టలు, కూరగాయలు, కిరాణా సరుకులు, ఇతర రోజువారి అవసరాల వస్తువులన్నీ ఈ మార్కెట్‌లో అందుబాటులో ఉండడంతో ప్రజలకు ఇది ముఖ్యమైన మార్కెట్‌గా నిలుస్తోంది.
రైతులు, వ్యాపారులు, ప్రజలు కలిసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు – బిబిపేట మార్కెట్‌ను స్థిర మార్కెట్‌గా అభివృద్ధి చేసి, పక్కా వసతులు కల్పించాలని. ఇది ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని మార్కెట్ చైర్మన్ కోరారు.
Post a Comment