-->

నేడు విడుదల పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు!

నేడు విడుదల పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు!


హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు.

ఫలితాలను మధ్యాహ్నం 3:00 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్
లో చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాల్ టికెట్ నంబర్ ద్వారా తమ ఫలితాలను సులభంగా పొందవచ్చు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు ప్రింట్‌ తీసుకొని భవిష్యత్తు విద్యార్హతల కోసం ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.


Blogger ఆధారితం.