Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలపై వర్షాల భయం మళ్లీ తలెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే - పలు జిల్లాలకు అలర్ట్!!
ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య విస్తరించి ఉండగా, మరో ఆవర్తనం దక్షిణ జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి.మీ లోపల ఏర్పడిందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంగా:
-
తెలంగాణలోని పలు జిల్లాల్లో🔸 ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు🔸 గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు🔸 కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
-
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో🔹 ఈ రెండు రోజులలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంటలు, విద్యుత్ సదుపాయాలు, ప్రయాణాలు వర్షాల ప్రభావంతో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Post a Comment