-->

మహిళా స్వయం సహాయక సంఘాలకు పండగగా రూ.344 కోట్లు – వడ్డీ లేని రుణాలు విడుదల

మహిళా స్వయం సహాయక సంఘాలకు పండగగా రూ.344 కోట్లు – వడ్డీ లేని రుణాలు విడుదల


హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. మొత్తం రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు.

ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల బ్యాంక్ ఖాతాల్లో వడ్డీల రాయితీ అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీలో పాల్గొననున్నారు. ప్ర‌మాద బీమా, లోన్ బీమాల చెక్కులు కూడా ఈ సందర్భంగా పంపిణీ చేయనున్నారు.

గతంలో BRS పాలనలో వడ్డీ రాయితీ రుణాలు నిలిచిపోయి, రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్టు సమాచారం. కాగా, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే వీటి చెల్లింపులను ప్రారంభించింది. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ గాడిలోపడ్డాయి.

ఈ కార్యక్రమం వెనుక మంత్రి సీతక్క ముఖ్య పాత్ర పోషించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె చొరవతో మహిళా సాధికారతకు మరింత బలంపడుతోందని అభిప్రాయపడ్డారు.

Blogger ఆధారితం.