-->

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ


భద్రాద్రి కొత్తగూడెం, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముర్రేడు వాగు వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. జయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ రైల్వే స్టేషన్ వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ, చిన్న కుటుంబం–సుఖమైన జీవితం నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించాలని, బాల్య వివాహాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల పోషక స్థితి మెరుగుపరచడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధువన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యు. తేజశ్రీ, డిప్యూటీ డిఎం & హెచ్‌ఓ ఫైజ్‌మోహియుద్దీన్, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, పర్యవేక్షక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహిళల సాధికారత, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పట్ల చైతన్యాన్ని పెంపొందించడంలో ఈ ర్యాలీ ముఖ్యమైన పాత్ర పోషించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.


Blogger ఆధారితం.