విద్యా జాగృతి ఉద్యమంతోనే సమాజ వికాసం – జమాతే ఇస్లామి హింద్
రుద్రంపూర్ రామవరం, “చదువుతోనే సమాజ సంస్కరణ సాధ్యం. జ్ఞాన వ్యాప్తి ద్వారా మానవతా విలువలు పెంపొందుతాయి,” అని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం శాఖ అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు.
పెనగడప పంచాయతీ పరిధిలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు చరిత శ్రీ, శ్రావ్య, నాగలక్ష్మి లను జమాతే ఇస్లామి హింద్ తరఫున సన్మానించారు.
సాదియా జ్ఞాపకార్థం మొమెంటోలు, దుస్తుల పంపిణీ
జమాత్ సభ్యులు అబ్దుల్ బాసిత్ కుమార్తె సాదియా జ్ఞాపకార్థంగా విద్యార్థినులకు మొమెంటోలు అందజేశారు. అలాగే, తాటిపల్లి సేవట్రస్ట్ సహకారంతో నూతన దుస్తులు పంపిణీ చేశారు.
కుల మతాలకు అతీతంగా విద్యా సేవ
ఈ సందర్భంగా మాజిద్ రబ్బానీ మాట్లాడుతూ – “జమాతే ఇస్లామి హింద్ ప్రతియేటా ‘విద్యా జాగృతి ఉద్యమం’ లో భాగంగా కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తుంది” అని తెలిపారు.
ఉపాధ్యాయుల కృతజ్ఞతాభివ్యక్తి
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ – “ప్రతి సంవత్సరం విద్యార్థులకు సహాయం అందిస్తున్న జమాతే ఇస్లామి హింద్ కు మా ప్రత్యేక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు:
మౌలానా అంజత్, హమీద్, షబ్బీర్, షమీం, తాజుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, మన్హా షహరీష్ తదితర జమాత్ సభ్యులతో పాటు టీచర్లు కరీముల్లా, శాంతి శ్రీ, శశికళ, బాలుసార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment