-->

🕋 హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోండి – ఖాజీ ఇస్మాయిల్ సూచన

🕋 హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోండి – ఖాజీ ఇస్మాయిల్ సూచన


గోదావరిఖని, 2026లో జరిగే పవిత్ర హజ్ యాత్రకు ముస్లింలు సమయానుసారంగా దరఖాస్తు చేసుకోవాలని ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి గారు సూచించారు. జమాత్-ఇ-ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, టెమ్రీస్ కౌన్సిలర్ అయిన ఆయన, శుక్రవారం అల్లూరు ప్రాంతంలోని మస్జిద్-ఈ-ఖుబా లో జరిగిన జుమా నమాజ్ సందర్భంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఖాజీ ఇస్మాయిల్ గారు మాట్లాడుతూ, “పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే అభ్యర్థులు జూలై 31లోపు తప్పనిసరిగా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి" అని తెలిపారు.

దరఖాస్తుతోపాటు అందించాల్సిన పత్రాలు:

  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్
  • బ్యాంక్ పాస్‌బుక్
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 85208 60785 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.


Blogger ఆధారితం.