తెలంగాణ ఉద్యమ యోధుడికి ఆర్థిక సహాయం: మన్నే పరంజ్యోతికి బిఎన్ ఫౌండేషన్ అండ
తెలంగాణ ఉద్యమ యోధుడికి ఆర్థిక సహాయం: మన్నే పరంజ్యోతికి బిఎన్ ఫౌండేషన్ అండ
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, న్యాయవాది మన్నే పరంజ్యోతి ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన జీవితాన్ని అంకితంగా ఉంచిన పరంజ్యోతి, గతంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితిని గుర్తించిన బిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.ఎన్. రావు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఆయన స్వయంగా పరంజ్యోతి కుటుంబ సభ్యులకు రూ. 20,000 ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్, తెరాస నేత మాజిద్ తదితరులు పాల్గొన్నారు. మన్నే పరంజ్యోతి న్యాయవాది ఉద్యమ సమయంలో కరీంనగర్ అడ్వకేట్ జేఏసీలో ముఖ్యపాత్ర పోషించి, ఢిల్లీ వరకు ఉద్యమ గళాన్ని వినిపించారు. తెలంగాణ కోసం తన శరీరాన్ని అర్పించిన ఆయనకు తగిన గుర్తింపు, ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
డాక్టర్ బిఎన్ రావు మాట్లాడుతూ –
“ఉద్యమ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టినవాళ్లు.. ఇప్పుడు basic ఆరోగ్య సేవలకూ నానా ఇబ్బందులు పడడం వేదన కలిగించేదిగా ఉంది. మన్నే పరంజ్యోతి గారు ఉద్యమానికి జీవం పోసిన నాయకుల్లో ఒకరు. అటువంటి వారికి సహాయం చేయడం మా బాధ్యత,” అని తెలిపారు.
కుటుంబ సభ్యులు మాట్లాడుతూ –
“ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యమంలో ప్రాణాలను సర్పించిన నేతలను గుర్తించాలి. వారికి సానుభూతి చూపించి, ఆర్థిక సహాయం చేయాలి,” అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ ఉదాహరణ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది నిస్వార్థంగా పోరాడిన నాయకుల పరిస్థితిపై మన దృష్టిని సారించేలా చేస్తోంది. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఇలాంటి ఉద్యమకారుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని సామాజిక వర్గాలు పిలుపునిస్తున్నారు.

Post a Comment