-->

ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జడ్పిటిసి, ఎంపిటిసి రిజర్వేషన్ కల్పించకపోతే తిరుగుబాటు ఉద్యమం

ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జడ్పిటిసి, ఎంపిటిసి రిజర్వేషన్ కల్పించకపోతే తిరుగుబాటు ఉద్యమం చేపడతాం బొమ్మెర శ్రీనివాస్ హెచ్చరిక


బయ్యారం క్రాస్‌రోడ్‌లోని పినపాక నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి కీలక ప్రకటన చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ కులాలకు జడ్పిటిసి, ఎంపిటిసి రిజర్వేషన్లను తిరిగి అమలు చేయాలని సమితి డిమాండ్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత, మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఈ ప్రాంతాల ఎస్సీలకు జరిగిన రాజకీయ అన్యాయాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు జడ్పిటిసి, ఎంపిటిసి రిజర్వేషన్‌లు కల్పించాలని సమితి స్పష్టం చేసింది. ఈ నెల 23, 24 తేదీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు తెలిపారు.

మౌనం కొనసాగితే, హైదరాబాద్‌ నుండే తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తామని బొమ్మెర శ్రీనివాస్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఇనుముల వెంకటేశ్వర్లు, జాడి లక్ష్మయ్య, సోంపల్లి తిరుపతి, జిల్లా మహిళా నాయకురాలు నీలం పార్వతి, జిమ్మిడి సుమన్, దాసరి రవికుమార్, జాడి కిరణ్ కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.