బిగ్ బ్రేకింగ్: సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత!
టాలీవుడ్‌కి తీరని లోటు. విలన్, కమెడియన్‌గా వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈరోజు (జూలై 19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఆరోగ్య సమస్యలు.. కిడ్నీలు ఫెయిల్...
ఫిష్ వెంకట్ రెండూ కిడ్నీలు ఫెయిలవడం వల్ల గత కొన్ని నెలలుగా డయాలసిస్‌పై జీవితం కొనసాగిస్తూ వచ్చారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం సినీ పరిశ్రమను, ప్రభుత్వాన్ని ఆర్థికంగా సాయం చేయాలంటూ కోరారు. అయితే అవసరమైన ఖర్చు సుమారు ₹50 లక్షలు అవుతుందని తెలుస్తోంది.
కొందరు సహాయం చేసినా... తీరని బాధ
వెంకట్ అనారోగ్యం గురించి తెలిసిన కొంతమంది నటులు, దర్శకులు స్వల్ప సహాయం చేసినప్పటికీ... అవసరానికి సరిపడా ఆర్థిక సాయం అందలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ₹2 లక్షలు ఆర్థికంగా సహాయం చేసినట్టు సమాచారం. అయినప్పటికీ అప్పటికే వెంకట్ ఆరోగ్య పరిస్థితి గణనీయంగా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు.
సినీ ప్రయాణం: 'ఆది' నుండి 'గబ్బర్ సింగ్' వరకు
వెంకట్ నటుడిగా వెండితెరకు పరిచయం ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాతో. తర్వాత పలు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, కమెడియన్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు మంచి ఆదరణ లభించింది.
ఇండస్ట్రీకు తీరని లోటు
వెంకట్ మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి టాలీవుడ్‌కు తీరని లోటుగా పేర్కొంటున్నారు. పేద జీవితం నుంచి సినీ రంగంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ఆయన జీవితం ఇప్పటితరం నటులకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Post a Comment