💥 కల్తీ కల్లు కలకలం... కూకట్‌పల్లిలో కల్తీ కల్లు బాధితుల్లో ముగ్గురు మృతి 💥
హైదరాబాద్, కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. హెచ్‌ఎంటీ హిల్స్‌లోని సాయిచరణ్ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కల్తీ కల్లు తాగి మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తులసిరామ్ (47), బొజ్జయ్య (55) మృతి చెందగా, నారాయణమ్మ (65) ఇంట్లోనే మృతి చెందినట్లు సమాచారం. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం వల్ల కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.
కల్తీ కల్లు తాగిన మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఇప్పటి వరకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు సీరియస్‌గా స్పందించి విచారణ ప్రారంభించారు. బాధితుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
👉 కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు.
👉 కాలనీలో కల్తీ మద్యం సరఫరాకు ఎవరు బాధ్యులన్న దానిపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Post a Comment