-->

లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్*

లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్*


హైదరాబాద్‌, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 11 నుంచి ప్రారంభమయ్యే లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉత్సవాలు ఘనంగా జరుగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.

మహేష్ కుమార్ గౌడ్ ఆలయానికి విచ్చేయడంతో ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, మాజీ చైర్మన్లు కె. వెంకటేష్, కె. విష్ణు గౌడ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అతిధిని సన్మానించి శాలువా కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Blogger ఆధారితం.