-->

ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా


హైదరాబాద్‌: తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు.

"నాటు నాటు" పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న రాహుల్, తెలంగాణ తరఫున అంతర్జాతీయ వేదికపై తెలుగు సంగీతానికి ప్రతిష్టను తీసుకువచ్చారని సీఎం ప్రశంసించారు. పాతబస్తీకి చెందిన రాహుల్ సిప్లిగంజ్, తన కృషితో సినీ రంగంలో ఎదిగి, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సీఎం అన్నారు.

గతంలో గద్దర్ అవార్డుల సందర్భంగా రాహుల్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, త్వరలో ప్రభుత్వ గుర్తింపుతో పురస్కారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ, ఈరోజు బోనాల సందర్భంగా రాహుల్‌కు నజరానా ప్రకటించారు.

Blogger ఆధారితం.