డివిజన్ పరిధిలోని దాబా, హోటల్ యాజమానులతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సమీక్షా సమావేశం
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్‌లో హోటల్స్, దాబాల యాజమాన్యాలతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, వెల్దుర్తి, రామాయంపేట, నార్సింగి, శివంపేట్ ప్రాంతాలకు చెందిన సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ:
-
దాబా హోటల్స్‌లో మద్యం సిట్టింగులు నిషిద్ధం అని స్పష్టం చేశారు. పోలీస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని, అవసరమైతే సంబంధిత హోటల్‌ను సీజ్ చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.
-
సీసీ కెమెరాల వ్యవస్థ తప్పనిసరి అని హోటల్ యాజమాన్యులకు సూచించారు. కెమెరాలు హోటల్ పరిసర ప్రాంతాలను స్పష్టంగా చూపేలా అమర్చాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు నిందితులను పట్టుకోవడానికి సీసీ ఫుటేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
-
పాన్ షాపులు, టీ పాయింట్లు, ఇతర వ్యాపార సంస్థలు రాత్రి 11:30 లోపల మూసివేయాలి, అలా కాకుండా అర్ధరాత్రి 12 తర్వాత కూడా తెరిచి ఉంచిన యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
-
పాన్ షాపుల్లో గంజా, ఇతర మత్తు పదార్థాల విక్రయం పూర్తిగా నిషిద్ధం అని హెచ్చరించారు. ఇలాంటి దృశ్యాలు కనిపించినచో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
-
ఘటనల సమయంలో బాధితులను ఆసుపత్రికి తరలించడం, పోలీసులు సహాయం చేయడం ముఖ్యమని డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినవారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రూ.5,000 నగదు బహుమతి ఇవ్వబడుతుందని, అలాగే పోలీస్ శాఖ తరఫున ప్రశంసలు లభిస్తాయని వివరించారు.
ఈ సమావేశంలో హాజరైన హోటల్స్, దాబాల, టీ పాయింట్ యాజమానులు తమ సమస్యలను పోలీస్ అధికారులతో పంచుకున్నారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ వ్యాపారులు నిబంధనలను గౌరవించాలి, పోలీసులకు సహకరించాలి, ప్రజా రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని అన్నారు.
ఈ సమావేశం అటు పోలీస్ శాఖకు, ఇటు వ్యాపారవేత్తలకు అవగాహన కలిగించడంతో పాటు భవిష్యత్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా సాగింది.

Post a Comment