-->

ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానమే హత్యకు దారి..!

చందునాయక్‌ హత్యకేసులో ఐదుగురు అరెస్టు – రివాల్వర్‌, కారు స్వాధీనం – పోలీసుల వివరణ


సైదాబాద్‌, పట్టపగలే గన్‌తో కాల్చి హత్య చేసిన సీపీఐ నేత కేతావత్‌ చందునాయక్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులో గుడిసెవాసుల వద్ద వసూలు చేసిన నగదు పంపకాల్లో తలెత్తిన ఆర్థిక విభేదాలు, అదనంగా వివాహేతర సంబంధంపై అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.

దాడిలో పాల్గొన్నది తొమ్మిది మంది ముఠా

ఈ నెల 15న మలక్‌పేట శాలివాహననగర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌ చేయి బయటకు వస్తున్న చందునాయక్‌పై నిందితులు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. దాడిలో రాజన్న అలియాస్‌ దొంతి రాజేశ్‌ మేనేజ్‌ మెంట్‌లోనే తొమ్మిది మంది పాల్గొన్నారు. ముఠా సభ్యులు చందునాయక్‌ కంట్లో కారం వేసి, అనంతరం కాల్చి హత్య చేశారు.

అరెస్టైన నిందితులు:

  1. దొంతి రాజేశ్‌ అలియాస్‌ రాజన్న
  2. ఏడుకొండలు
  3. అర్జున్‌ జ్ఞానప్రకాశ్
  4. లింగిబేడి రాంబాబు
  5. ప్రశాంత్‌, శ్రీను అలియాస్‌ నాగరాజు

వీరి నుంచి రెండు పిస్టల్స్‌, రివాల్వర్‌, కారు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

పోలీసుల వివరాలు:

ఈ కేసు విషయమై సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చైతన్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. అదనపు డీసీపీ శ్రీకాంత్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ అందే శ్రీనివాస్‌, ఏసీపీలు సుబ్బరామిరెడ్డి, సోమ వెంకట్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నరేశ్‌, జయశంకర్‌, చంద్రమోహన్‌, ఆనంద్‌కుమార్‌ వివరాలను పంచుకున్నారు.

 బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన:

చందునాయక్‌ హత్యపై గిరిజన సంఘం మహిళలు, కుటుంబసభ్యులు, అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట రవీంద్రాచారి, యాదిరెడ్డిలను కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో కొంతకాలం ఉద్రిక్తత నెలకొంది.

Blogger ఆధారితం.