తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన సలహాదారుల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్సీ ఎం. కోదండరాం నియమితులయ్యారు. కమిటీ కన్వీనర్‌గా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ వ్యవహరించనున్నారు.
ఇక సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కమిటీలో చోటు దక్కించుకున్నారు. వీరిలో–
- గుమ్మడి వెన్నెల – సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్
- డా. అలేఖ్య పుంజాల – సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు
- డా. సుద్దాల అశోక్ తేజ – ప్రముఖ సినీ గీత రచయిత
- బి. నర్సింగరావు – కవి, దర్శకుడు
- కవి జయరాజ్, డా. సంగిశెట్టి శ్రీనివాస్ – రచయితలు
- డా. కొయి కోటేశ్వరరావు – విమర్శకుడు
- డా. పసునూరి రవీందర్ – రచయిత
- జానపద కళాకారులు దరువు ఎల్లన్న, అంతుడుపుల నాగరాజు, ఏపూరి సోమన్న, డా. ఒగ్గు రవి కుమార్, నేర్నాల కిషోర్, పల్లె నరసింహ
- డా. ఖాజా పాషా – సినీ దర్శకుడు
- డా. యాకూబ్ – కవి
- డా. జూకంటి జగన్నాథం – రచయిత
- దరువు అంజన్న – కళాకారుడు
ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర భాష, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.

Post a Comment