-->

సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య – గ్రామంలో విషాదం

సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య – గ్రామంలో విషాదం


సిరిసిల్ల, ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు జీవితాన్ని ముగించుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో విషాదాన్ని మళ్లి చాటించింది. గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్ (25) అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఉన్నత విద్యావంతుడైన శ్రీకాంత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక పరీక్షలు రాసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆవేదనలో జీవితంపై విరక్తి చెంది బుధవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఈ సంఘటనపై బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Blogger ఆధారితం.