హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ఆగస్టు 30,31 మహాసభలను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ
మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్: ఈ నెల 30, 31 తేదీలలో జరగబోయే హెచ్‌ఎంఎస్ రాష్ట్ర 26వ ద్విపక్షికా మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక నాయకులు పిలుపునిచ్చారు.
సెంటినరీ కాలనీ హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర కమిటీ నాయకులు గోషిక అశోక్, ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి, ఆర్జీ-3 ఏరియా శాఖ ఉపాధ్యక్షుడు కొమ్ము మదనయ్య పాల్గొని మైనర్ల కార్మిక వర్గం మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
“సింగరేణి మైనర్లు తమ హక్కుల కోసం గళమెత్తిన ప్రతి సందర్భంలో హెచ్‌ఎంఎస్ ముందుండి పోరాడింది. రాబోయే మహాసభలు కార్మిక వర్గం ఐక్యతకు నాంది కావాలి. అందరూ బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి” అని అన్నారు.
సమావేశంలో కార్యదర్శి, బ్రాంచ్ సెక్రటరీ ALP మహేష్, పిట్ సెక్రటరీ రాజశేఖర్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగు అంజి, షిఫ్ట్ సెక్రటరీ రానా, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment