-->

తెలంగాణ జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు?

తెలంగాణ జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు?


హైదరాబాద్, ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని వణికించాయి. భారీ నుంచి అతిభారీ వర్షాల దెబ్బకు వాగులు, వంకలు పొంగిపొర్లగా, గోదావరి-కృష్ణా నదుల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగింది. పంటలు నష్టపోయి రైతులు ఆందోళన చెందగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో, మళ్లీ వర్షాల హెచ్చరిక రావడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల అవకాశముందని పేర్కొంది.

మంగళవారం, బుధవారం రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.

అయితే రాష్ట్రంలోని ఐదు జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793