ఆర్టీసీ బస్సుకు మరమ్మత్తులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం
హైదరాబాద్, మెహదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం అగ్నికి ఆహుతైంది. ప్రయాణికులు ఎవరూ లేని సమయంలోనే ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సాక్షుల వివరాల ప్రకారం—బస్సు స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ దాన్ని పక్కకు నిలిపి మరమ్మత్తులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు మాత్రం తీవ్రంగా దగ్ధమైంది.

Post a Comment