భద్రాచలం గోదావరిలో వరద ఉధృతి – మూడవ ప్రమాద హెచ్చరికకు అంచున
భద్రాచలం: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. నది నీటి మట్టం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు.
మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగుల వద్ద జారీ చేయనున్నారు.
వరద ప్రభావిత మండలాల్లోని అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించారు.
🔸 నది పరివాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతుండటంతో గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.
🔸 తక్కువ ఎత్తులో ఉన్న వాడల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
🔸 సహాయక దళాలు, రెవెన్యూ శాఖ, పోలీసు బలగాలు మోహరించారు.
ప్రస్తుతం గోదావరి ఉధృతి ఇంకా పెరుగుతున్నదని అధికారులు తెలిపారు.

Post a Comment