తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల!
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో స్పోర్ట్స్ పాలసీకి ఆకృతి ఇచ్చారు. ఈ దిశగా ఏర్పాటు చేసిన "తెలంగాణ స్పోర్ట్స్ హబ్" బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెలను ప్రభుత్వం నియమించింది.
తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా గమ్యంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ హబ్‌ను ప్రారంభించింది. బోర్డ్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా, కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌లో సిఎస్ఆర్ వైస్ ఛైర్‌పర్సన్, అలాగే UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువత అభివృద్ధిపై చేసే కార్యక్రమాలు విశేష గుర్తింపు పొందాయి. ఈ అనుభవంతో ఆమె క్రీడాకారుల సంక్షేమం, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ రంగాల్లో నూతన మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
ఇదిలా ఉంటే, కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా రాజకీయ జోక్యాన్ని దూరంగా ఉంచుతూ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ధ్యేయయం.
Post a Comment